Pro Kabaddi League 2019 : U Mumba Down Patna Pirates In A Nail-Biting Finish || Oneindia Telugu

2019-08-17 242

PKL 2019: U Mumba edges past Patna, Gujarat ends home-leg winless after Jaipur loss
A last minute super-raid from Rohit Baliyan helped U Mumba edge past Patna Pirates to a 34-30 win, while Gujarat Fortunegiants' misery continued as it ended its home-leg with a 19-22 loss to table-topper Jaipur Pink Panthers.
#pkl2019
#prokabaddi
#prokabaddileague
#RohitBaliyan
#umumba
#patnapirates
#JaipurPinkPanthers
#GujaratFortunegiants

ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో యు ముంబా నాలుగో విజయం నమోదు చేసుకుంది. మ్యాచ్‌ ఆఖరి నిమిషంలో రోహిత్‌ బలియన్‌ సూపర్‌ రైడ్‌ సాధించడంతో యు ముంబా.. పట్నా పైరేట్స్‌ను ఓడించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన పోరులో ముంబా 34-30తో పాట్నా పైరేట్స్‌పై గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి ముంబానే ఆధిపత్యం ప్రదర్శించింది. సందీప్‌ నర్వాల్‌ వరుస పాయింట్లు తీసుకు రావడంతో ముంబా తొలి అర్ధభాగంలో 22-11తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అయితే, రెండో అర్ధభాగంలో పట్నా అద్భుతంగా పుంజుకుంది. పర్‌దీప్‌ నర్వాల్‌ కూతకు వెళ్లిన ప్రతిసారీ పాయింట్లు సాధించాడు.ఈ క్రమంలో పర్‌దీప్‌ నర్వాల్ పీకేఎల్‌లో 1600 రైడ్‌ పాయింట్లను అందుకున్నాడు. రోహిత్‌ బలియన్‌ (9 పాయిం ట్లు) విజృంభించడంతో యు ముంబా పుంజుకుంది. రోహిత్‌, సందీప్‌ నర్వాల్‌ (6) వరుస రైడ్లలో పాయింట్లు సాధించి ఆట 34వ నిమిషానికి 29-24తో ముంబాను విజయానికి చేరువ చేశారు.